కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతి సొమ్మును పంచుకొని ఇప్పుడు తిట్టుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని, రాష్ట్రంలో పదేళ్లపాటు యథేచ్ఛగా దోపిడీ జరిగిందన్నారు. పంపకాల్లో విభేదాలు వచ్చి ఇప్పుడు బయటపడుతున్నారు. వాళ్ల పార్టీ లేకుండా వారే చేసుకుంటున్నారు. కవిత ఇన్ని రోజులు బాణాన్ని కేటీఆర్ మీదకు ఎక్కుపెట్టారు. అకస్మాత్తుగా ఆ బాణాన్ని హరీశ్‌రావు మీదకు తిప్పారు. అమెరికా వెళ్లి వచ్చాక కవిత వైఖరిలో మార్పు కనిపించింది. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని నా సందేహం. కేసీఆర్ కుటుంబంలో ఇది కొత్త నాటకమని అన్నారు.
కేసీఆర్ కుటుంబంలో ఇది కొత్త నాటకం : మహేశ్ కుమార్ గౌడ్
September 03, 2025
0
Tags