ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న ఆయనకు చెందిన అల్లు బిజినెస్ పార్క్‌పై ఈ చర్యలు తీసుకున్నారు. ఈ భవన నిర్మాణానికి నాలుగు అంతస్తుల వరకు మాత్రమే జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది.. అయితే, తాజాగా భవనంపై అదనంగా ఒక పెంట్‌హౌస్‌ను నిర్మించారని అధికారులు ఇటీవలే గుర్తించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అనుమతులు లేని ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరించాలని కోరుతూ జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు అల్లు అరవింద్‌కు షోకాజ్ నోటీసు పంపారు. అల్లు ఫ్యామిలీ వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా ఉండనున్న ఈ అల్లు బిజినెస్ పార్క్ నిర్మాణ పనులు 2023 నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. దివంగత నటుడు అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి సంస్థల కార్యాలయాలు ఈ భవనంలో ఉండనున్నాయి. అయితే, అక్రమ నిర్మాణాల కారణంగా ఈ భవనం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.
అల్లు అరవింద్ ఇంటికి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ !
September 09, 2025
0
Tags