ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Telugu Lo Computer
0


హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ కోకాపేట వద్ద నిర్మించిన ట్రంపెట్ ఇంటర్ చేంజ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోకాపేట నియోపోలీస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వన్ఏ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరవాసులు ట్రాఫిక్ తో పడే ఇబ్బందులు అన్నిఇన్ని కాదు. ఈ క్రమంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈజీగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ నియో పోలీస్ లేఅవుట్ నుండి నేరుగా అవుటర్ రింగ్ రోడ్డు కు కనెక్ట్ అవుతుంది. దీనివల్ల శంషాబాద్ విమానాశ్రయానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన సమయం గణనీయంగా తగ్గుతుంది. గతంలో 45 నిమిషాల నుండి ఒక గంట సమయం పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాలకే తగ్గింది. ఈ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉండదు. టైం సేవ్ అవుతుంది. ఈ ట్రంపెట్ జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డు ను నియో పోలీస్ లేఔట్ తో నేరుగా అనుసంధానం చేస్తుంది ఇది 1.27 కిలోమీటర్ల పొడవుతో నాలుగు వరుసలతో కూడిన రహదారి. ఇందులో ప్రధాన ట్రంపెట్ స్ట్రెచ్ 600 మీటర్లు ఉంటుంది. మిగిలినదంతా సర్వీస్ రోడ్డుగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా నియో పోలీస్, శంకర్పల్లి ప్రాంతాలకు చెందిన ప్రజలు ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఈజీగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రంపెట్ జంక్షన్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 65 కోట్ల రూపాయలను కేటాయించింది. నియో పోలీస్ లేఅవుట్ అభివృద్ధికి 450 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. నియో పోలీస్ లేఔట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కోకాపేట రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడం కోసం హెచ్డిఎంఏ నిర్ణయాలు తీసుకుని లింక్ రోడ్ లను ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసులకు ట్రాఫిక్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)