స్కూల్ దగ్గర వదిలిపెడతానని బైక్ ఎక్కించుకుని బాలికపై అత్యాచారం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లిలో మైనర్ బాలికను స్కూల్ దగ్గర వదిలిపెడతానని బైక్ ఎక్కించుకున్న ఓ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. బ్రాహ్మణపల్లికి చెందిన 40 ఏళ్ల ప్రసాద్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఆరవ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై అత్యాచారని పాల్పడ్డాడు. బాలిక స్కూలుకు వెళుతుండగా చూసిన నింధితుడు ఆమెను స్కూల్ దగ్గర వదిలిపెడతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. అనంతరం మారుమూల ప్రదేశానికి తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయం తల్లి దండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నింధితుడిని అరెస్ట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)