విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని, దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకముందని అన్నారు. ఈ సదస్సును ఏసీఐఏఎం, భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు మెలకువలు అవసరమని, దీని ద్వారా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. న్యాయం పొందడం తమ హక్కు అని ప్రజలు భావించి కోర్టులకు వస్తుంటారన్నారు. నూతన సాంకేతికత వినియోగంలో భారత్ పరుగులు పెడుతోందన్నారు. క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. అవసరమైన ఎకో సిస్టమ్ తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు.
మధ్యవర్తిత్వంతో సమస్యకు సత్వర పరిష్కారం !
September 05, 2025
0
Tags