పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన కారు : యువతి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నగరంలోని లంగర్‌హౌస్‌ దర్గా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్న డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ వాహనాన్ని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కశ్వి (20) అనే యువతి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.  ఆ కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. మద్యం మత్తులో ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)