నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మరోసారి తెరిచారు. 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో 1,33,824 క్యూసెక్కులు వస్తుండగా, అంతే మొత్తంలో ఔట్‌ఫ్లోగా వదులుతున్నారు. కుడి కాల్వకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,454 క్యూసెక్కులు, పవర్‌హౌస్‌కు 32,480 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.14 టీఎంసీలుగా నమోదైంది.
నాగార్జునసాగర్ 10 గేట్లు ఎత్తి దిగువుకు నీరు విడుదల
September 07, 2025
0
Tags