ఒకటికి మించి ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరం : ఎన్నికల సంఘం

Telugu Lo Computer
0


కటికి మించి ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరమని, ఒకవేళ రెండు, అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకదాన్ని మాత్రమే పెట్టుకొని, అదనపు కార్డులను సరెండర్‌ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ''రెండు ఓటరు కార్డులను కలిగి ఉండటం ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం నేరం. సెక్షన్‌ 31 కింద వారికి గరిష్ఠంగా ఏడాది శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉండొచ్చు. ఒకవేళ ఎవరి వద్దనైనా రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు ఉంటే ఒకటి మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలి'' అని ఈసీ అధికారులు వెల్లడించారు. ఓటరు జాబితాలో రెండు చోట్ల ఓటరుగా ఉన్నట్లయితే.. ఒకచోట తమ పేరును తొలగించాలని కోరుతూ ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనూ వెసులుబాటు ఉందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)