దేవాదాయ సహాయ కమిషనర్‌ శాంతి నిర్బంధ ఉద్యోగ విరమణ ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కె.శాంతి నిర్బంధ ఉద్యోగ విరమణకు రంగం సిద్ధమైంది. వివిధ ఆరోపణల నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్‌ ఇటీవల జారీచేసిన తాఖీదుపై ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిసింది. దీంతో ఆమెతో నిర్బంధ ఉద్యోగ విరమణ చేయిస్తూ ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వు రానుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆమె విశాఖపట్నం జిల్లా సహాయ కమిషనర్‌గా, విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్‌ జిల్లాల దేవాదాయశాఖ అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె నిబంధనల ఉల్లంఘన, దేవాదాయ ఆస్తులను పరిరక్షించకపోవడం, ఆలయాలకు నష్టం కలిగేలా వ్యవహరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఎం.మదన్‌మోహన్‌తో మొదటి వివాహం జరగ్గా, ఆయనతో విడాకులు తీసుకోకుండానే పి.సుభాష్‌ను రెండో వివాహం చేసుకున్నారు. దీంతో గత ఏడాది ఆగస్టులో ఆమెను సస్పెండ్‌ చేసి, ఆ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. తనపై ఉన్న అభియోగాలకు ఆమె సరైన వివరణ ఇవ్వలేదు. దీంతో నిర్బంధ ఉద్యోగ విరమణ ఎందుకు చేయించకూడదో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ గతనెల 16న దేవాదాయ కమిషనర్‌ తాఖీదు ఇచ్చారు.



Post a Comment

0Comments

Post a Comment (0)