క్లాసిక్ లెజెండ్స్ (సీఎల్) జావా, యెజ్డి బైక్ ల కొత్త ధరలను ప్రకటించింది. వీటిలో అడ్వెంచర్, రోడ్ స్టర్, బాబర్ నుండి స్క్రాంబ్లర్ ఉన్నాయి. ఇప్పుడివి రూ .2 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి. పర్యావరణానికి పనికిరాదని భావించిన టూ స్ట్రోక్ మోటార్ సైకిల్ ను నిషేధించిన విధాన మార్పు కారణంగా దేశంలో జావా, యెజ్డీ అమ్మకాలను కంపెనీ గతంలోనిలిపివేసింది. అయితే జీఎస్టీ 2.0 సంస్కరణలతో జావా, యెజ్డీ బైక్లుతిరిగి రోడ్లపైకి వస్తాయని కంపెనీ తెలిపింది.350 సీసీ లోపుమోటార్ సైకిళ్లపై జీఎస్టీని తగ్గించి18 శాతం పరిధిలోకితీసురావడాన్నిస్వాగతిస్తున్నట్లు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో తమ 293 సీసీజావా, 334 సీసీ యెజ్డి పర్ఫార్ మెన్స్ క్లాసిక్ బైక్ ల ధరలు కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
జావా, యెజ్డి బైక్‌ల ధరలు తగ్గింపు !
September 07, 2025
0
Tags