చాలా దేశాల్లో డిమాండ్‌కు తగినంత శ్రామికశక్తి లేదు !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలో జరిగి అబ్జర్వర్‌ రీసెర్చి ఫౌండేషన్‌ నిర్వహించిన 'ఎట్‌ ది ఆర్ట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌: ఎయిడ్‌, ట్రేడ్‌, అండ్‌ డెవలప్‌మెంట్‌' అనే కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పాల్గొని మాట్లాడుతూ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ ఎక్కడ ఉండాలన్నది రాజకీయంగా చర్చనీయాంశం. కానీ, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఆయా దేశాల్లో డిమాండ్‌, అక్కడి జనాభాను చూడండి. అందుకే చాలాచోట్ల డిమాండ్‌కు తగినంత శ్రామికశక్తి లేదు. ఇది వాస్తవం. దాని నుంచి మీరు తప్పించుకోలేరు. అందుకే మనం మరింత సమర్థవంతమైన, సమకాలీన శ్రామిక శక్తిని సృష్టించాలి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలు ఇది. ప్రపంచంలోని దేశాల మధ్య విభిన్నమైన వాణిజ్య ఒప్పందాలను మనం చూడబోతున్నాం. ఇతర పరిస్థితుల్లో తీసుకోలేని నిర్ణయాలను కూడా అమలు చేయడం చూడబోతున్నాం. భౌతిక, డిజిటల్‌ కారణాలతో నేడు వాణిజ్యం చాలా సులభమైపోయింది. మెరుగైన రోడ్లు, షిప్పింగ్‌, ఎన్నడూ లేనంత సరళమైన వాణిజ్య విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచం గత మూడు నాలుగేళ్లుగా పంపిణీ వ్యవస్థలు, ఉత్పత్తి సోర్సుల విషయంలో ఆందోళన చెందుతోందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)