హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు బ్రిటన్ వైద్యుల సహకారంతో పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ప్రకటించారు. ముందుగా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమైన వారికి తక్షణమే ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా భరిస్తోంది. ప్రొఫెసర్ బీరప్ప వివరాల ప్రకారం, నిమ్స్ ఆసుపత్రి పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో డా. అమరేష్ రావు, డా. ప్రవీణ్, డా. గోపాల్ వంటి నిపుణ వైద్యులు పిల్లలను పరీక్షించనున్నారు. ప్రతి మంగళవారం, గురువారం, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పిల్లల తల్లిదండ్రులు అంతకుముందు తీసుకున్న రిపోర్టులు, సీటీస్కాన్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆసుపత్రి అధికారులు సూచించారు.
నిమ్స్‌లో బ్రిటన్ వైద్యుల సహకారంతో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు !
September 01, 2025
0
Tags