ఆసియా కప్‌లో పాకిస్తాన్ పై టీమ్‌ఇండియా ఘన విజయం

Telugu Lo Computer
0


దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్‌ సూపర్‌-4లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత బౌలర్లు సమష్టిగా విజృంభించంతో మొదట పాక్‌ 9 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచిన కుల్‌దీప్‌ యాదవ్‌ (3/18)కు తోడు అక్షర్‌ పటేల్‌ (2/18), బుమ్రా (2/28), వరుణ్‌ చక్రవర్తి (1/24)ను పాక్‌ను దెబ్బ తీశారు. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (40; 44 బంతుల్లో 1×4, 3×6), టెయిలెండర్‌ షహీన్‌ షా అఫ్రిది (33 నాటౌట్‌; 16 బంతుల్లో 4×6) పోరాడకుంటే పాక్‌ ఆ మాత్రం స్కోరైనా చేసేది కాదు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (47 నాటౌట్‌; 37 బంతుల్లో 5×4, 1×6), అభిషేక్‌ శర్మ (31; 13 బంతుల్లో 4×4, 2×6), తిలక్‌ వర్మ (31; 31 బంతుల్లో 2×4, 1×6) మెరుపులతో లక్ష్యాన్ని భారత్‌ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్‌ కోల్పోయిన మూడు వికెట్లూ స్పిన్నర్‌ సయిమ్‌ అయూబ్‌ (3/35) ఖాతాలోకే చేరాయి. టీమ్‌ఇండియా శుక్రవారం తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఒమన్‌ను ఢీకొంటుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)