ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైతు పాపన్నతోపాటు మరో రైతు ఆదివారం 500 బాక్సుల టమోటాలను గుత్తిలోని మార్కెట్లో విక్రయించేందుకు రెండు బొలెరోల్లో తీసుకొచ్చారు. కిలో రూ.3 నుంచి రూ.5 ధర పలకడంతో రవాణా ఖర్చులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదిలేక లచ్చానిపల్లి సమీపంలోని పెద్దవంకలో పారబోశాడు. తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
గిట్టుబాటు ధర రాక 500 పెట్టెల టమోటాలను పారబోసిన రైతులు
September 15, 2025
0
Tags