డొనాల్డ్ ట్రంప్ తో షెహబాజ్ షరీఫ్ భేటీ !

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక సమావేశాలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. పాక్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ సమయంలో ఆయన వెంట ఉన్నారు. ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. భారత్- అమెరికా మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ పాకిస్తాన్ పీఎంకు విందు ఇవ్వబోతోండటం చర్చనీయాంశమైంది. ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనడానికి షెహబాజ్ షరీఫ్ అమెరికా వెళ్లారు. సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దీని తర్వాత ఆయన స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంది. అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానం అందిందాయనకు. దీంతో న్యూయార్క్ నుండి నేరుగా వాషింగ్టన్ చేరుకున్నారు. వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తో ద్వైపాక్షిక సమావేశాలకు పాల్గొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఇటీవల కుదిరిన అమెరికా-పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. ఈ భేటీకి ముందు- షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌లను ట్రంప్ స్వయంగా స్వాగతించారు. వారిని గ్రేట్ లీడర్లుగా అబివర్ణించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఓవల్ ఆఫీస్ ట్రంప్ తో భేటీ కావడానికి వైట్ హౌస్ లో దాదాపుగా గంట పాటు షెహబాజ్ షరీఫ్ ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయనతో మాట్లాడటానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు గానీ పెద్దగా రెస్పాండ్ కాలేదాయన. కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన తర్వాత ట్రంప్ తన ఛాంబర్ నుంచి బయటికొచ్చారు. మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్, షరీఫ్‌లు కలుసుకున్న తర్వాత ఈ భేటీ ఏర్పాటైంది.అరబ్ దేశాల అధ్యక్షులతో పాటు ఈజిప్ట్, ఇండోనేషియా, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, తుర్కియే ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేకించి షెహబాజ్ షరీఫ్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)