ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి గుత్త వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తెలంగాణ ప్రాంతానికి తీసుకువచ్చి నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన విధితమే. గుత్త వెంకటేశ్వర్లు హైదరాబాద్ జాతీయ రహదారి మార్గము గుండా అచ్చంపేట, ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ పరిధిలో గల హాజీపూర్ నుండి వెల్టూరు పరిధిలో వెళుతున్నట్లు సీసీ కెమెరాలో కనిపించింది. కానీ తాను ఒక్కడే ఆత్మహత్య చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ ఇద్దరు చిన్న పిల్లల ఆచూకీ కోసం డీఎస్పీ పల్లె శ్రీనివాస్ సీఐ నాగరాజు ఎస్ఐలు విజయ భాస్కర్ తిరుపతిరెడ్డిలు మరికొంత మంది పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది గురువారం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల అనంతరం ముమ్మరంగా గాలింపు చేపట్టగా ఉప్పునుంతల మండలం సూర్య తండా సమీపంలో ఇద్దరి పిల్లలను తండ్రి గుత్త వెంకటేశ్వర్లు ముందుగా కాల్చి చంపి వేసినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కన్న తండ్రి అభం శుభం ఎరుగని చిన్నపిల్లలను కర్కశంగా చంపడాన్ని చూసిన సన్నివేశాన్ని పలువురు మనోవేదనకు గురి అయ్యారు. గత వారం రోజులుగా మిస్టరీగా మారిన పిల్లల ఆచూకీ ఎట్టకేలకు ఒక ప్రణాళిక ప్రకారం అచ్చంపేట పోలీసులు సమన్వయంతో గాలింపుతో మృతదేహాలను గుర్తించినట్లు సీఐ నాగరాజు దిశకు ఫోన్ ద్వారా తెలిపారు. వారి డెడ్ బాడీలు వివిధ భాగాలుగా అక్కడక్కడ పడిపోయి కనిపించాయి. కేసు నమోదు చేసుకొని అందుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇద్దరు పిల్లలను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
September 04, 2025
0
Tags