హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన 'ప్రజాస్వామ్యాన్ని రక్షించండి' కార్యక్రమానికి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పని చేయాలని ఆయన సూచించారు. స్వతంత్ర కమిషన్ ఉంటే ఓట్ల చోరీ జరగదని, ప్రభుత్వాలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను భయపెట్టి పనులు చేయించుకునే పరిస్థితులు ఉండవని అభిప్రాయపడ్డారు. ప్రజల ఓట్లతో కాకుండా ఈవీఎంలు విజయాన్ని డిసైడ్ చేస్తున్నాయని, ఈసీ పారదర్శకంగా పనిచేయటం లేదని విమర్శించారు. మత రాజకీయాలు చేస్తూ.. దేశంలో దొంగలు రాజ్యమేలుతున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. పేదవారి కోసం పోరాడిన వారు జైళ్లలో ఉంటున్నారని, చంపిన వారు రాజ్యాన్ని ఏలుతున్నారని విమర్శించారు.
ఎన్నికల సంఘం, దర్యాప్తు సంస్థలు స్వతంత్రను కలిగి ఉంటేనే ప్రజాస్వామ్యం ప్రాణంతో ఉంటుంది !
September 28, 2025
0
Tags