టాయిలెట్ డోర్ అనుకుని కాక్‌పిట్‌ డోర్‌ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు !

Telugu Lo Computer
0


బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి బాత్ రూమ్ అర్జెంట్ కావడంతో టాయిలెట్ డోర్ అనుకుని కాక్‌పిట్‌ డోర్‌ తెరిచేందుకు యత్నించాడు. అయితే పాస్ వర్డ్ ఉన్న కారణంగా ఆ డోర్ ఓపెన్ కాలేదు. హైజాక్ అవుతుందనే భయంతో తోటి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అయితే అతడి కదలికల్ని గమనించిన విమానం క్రూ సిబ్బంది వెంటనే ఆ ప్రయాణికుడ్ని సీట్లో కూర్చోబెట్టారు. విమానం వారణాసిలో ల్యాండింగ్ అయ్యాక ఎయిర్ ఇండియా సిబ్బంది ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించింది. తాను విమానం ఎక్కడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆ వ్యక్తి వాదించినట్లు సమాచారం. వీరిని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇక ఇదే విషయంపై ఎయిర్ ఇండియా మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత విషయంలో తాము ఎలాంటి రాజీపడటం లేదని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)