ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలోని నూతన భవనాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో రూ.3.55 కోట్లతో ఈ భవనం నిర్మాణం చేశాం. మొదటి ఫ్లోర్ లో విప్ లకు కేటాయించాం. మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేస్తాం అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ భవనాన్ని ప్రారంభించడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఈ భవన నిర్మాణం కోసం మంత్రి నారాయణ విశేష కృషి చేశారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశంసించారు. ఈ భవనం 5 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించినా, కేవలం రూ. 3.50 కోట్లతోనే నిర్మాణం పూర్తి చేశామని మంత్రి నారాయణ అన్నారు. గతంలో దీని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన పూర్తి కావడానికి ఆలస్యం అయ్యింది. త్వరలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం చేపడతాం. డిజైన్లు పూర్తి అయ్యాయి. అవి అందరికి విడుదల చేస్తాం అని మంత్రి నారాయణ అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో నూతన భవనం ప్రారంభం
September 25, 2025
0
Tags