విశాఖపట్నంలో ఫార్మా కంపెనీ డైరెక్టర్ అనుమానాస్పద మృతి

Telugu Lo Computer
0


విశాఖపట్నంలోని  స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ ఫార్మా కంపెనీ డైరక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది.  వసుధ ఫార్మా కంపెనీ డైరక్టర్ మంతెన వెంకట సూర్య నాగ వర ప్రసాద్ రాజు ఆత్మహత్య చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానంలో స్థానికులు మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృత దేహం పక్కనే పురుగులు మందు డబ్బా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పురుగులు మందు తాగి ఆత్మహత్యకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)