ఉత్తర ప్రదేశ్ లోని కుషి నగర్ జిల్లాలో ఒక కానిస్టేబుల్ తన భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇద్దరు కూడా పోలీసు డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తరచుగా అనుమానం పడేవాడు. ఆమె ప్రవర్తన సైతం అలానే ఉండేది. భర్త డ్యూటీ నుంచి తొందరగా ఇంటికి వచ్చాడు. అప్పటికే తన ఇంట్లో మరో వ్యక్తి ఉండటాన్ని సదరు వ్యక్తి గమనించాడు. వెంటనే బైట నుంచి లాక్ వేసి పోలీసులను పిలిచి డోర్ ను బద్దలు కొట్టి చూడగా అందులో నుంచి ఒక వ్యక్తి బైటకు వచ్చాడు. దీంతో మహిళ భర్త అతనిపై దాడి చేశారు. ఈ క్రమంలో అతను మరో పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడని విషయం తెలిసింది. దీంతో ఘటన స్థలంకు వచ్చిన పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇది కాస్త ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. అయితే బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అతని భార్య, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
మరో వ్యక్తితో భార్య ఉండగా పోలీసులకు పట్టిచ్చిన కానిస్టేబుల్ : వీడియో వైరల్
September 01, 2025
0
Tags