హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై రిటైర్డ్ మహిళా ఐపీఎస్ అంజనా సిన్హా ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ ను దహనం అనే వెబ్ సిరీస్ లో వాడారని మహిళ రిటైర్డ్ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. దహనం కు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ పై పోలీసులు ఐపీసీ 509, 468, 469, 500, and 120(B).సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో దహనం అనే సిరీస్ ను తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. కమ్యూనిస్ట్ నేత రాములును ఎలా హత్య చేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించాం అని ఆర్జీవీ తెలిపారు. అయితే అందులో వాస్తవం లేదని, తప్పుగా చూపించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా తన పేరును వాడటం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామ్ గోపాల్ వర్మ పై రిటైర్డ్ మహిళా ఐపీఎస్ అంజనా సిన్హా ఫిర్యాదు !
September 18, 2025
0
Tags