హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం - మజీద్ పూర్ గ్రామాల మధ్య వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు మజీద్ పూర్ వాగులోకి పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో రాత్రి కురిసిన వర్షం కారణంగా వాగులో వరద తీవ్రత పెరిగింది. ఉదయం ఓ ద్విచక్ర వాహనదారుడు వాగు దాటే ప్రయత్నంలో నీటిలో పడిపోయాడు. ఆ సమయంలో వాగు దాటుతున్న లారీలోని వారు అతన్ని గమనించి వరద ప్రవాహానికి లారీని అడ్డుగా నిలిపి నీళ్లలో పడిపోయిన ద్విచక్ర వాహనదారుడిని కాపాడి, కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాన్ని వెలికితీశారు.
వాగులో పడిన ద్విచక్ర వాహనదారుడు : కాపాడిన లారీ సిబ్బంది
September 20, 2025
0
Tags