సాంకేతిక సమస్య వల్ల 1,800కిపైగా విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం

Telugu Lo Computer
0


మెరికాలో టెలికాం సర్వీసుల్లో సాంకేతిక సమస్య కారణంగా డల్లాస్‌తో సహా పలు విమానాశ్రయాల్లో 1,800కి పైగా విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం, డల్లాస్‌తో పాటు మరో రెండు విమానాశ్రయాల్లో 1,800కి పైగా విమానాలు ఆలస్యం కాగా, వందలాది విమానాలు రద్దయ్యాయి. స్థానిక టెలిఫోన్ కంపెనీ పరికరాల్లో సమస్య తలెత్తినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. డల్లాస్‌లో 20 శాతం విమానాలు రద్దయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)