తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు విషయంలో కేంద్రానికి లేఖ రాసిందని భాజపా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. సీబీఐతో దర్యాప్తు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. 22 నెలల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు కాలయాపన చేశారో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీబీఐకి ఆ ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు యువత, ఉద్యోగులు, ప్రజలు పోరాటం చేశారు. అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుంది. భారత రాష్ట్ర సమితి రూ. కోట్లకు పడగలెత్తింది. ఇటీవల కాళేశ్వరం కూలితే, తాజాగా భారత రాష్ట్ర సమితి కూలిపోయింది. ఎమ్మెల్సీ కవిత బహిరంగంగా హరీశ్‌రావు, సంతోష్ అవినీతికి పాల్పడ్డారని, వారిద్దరూ అవినీతి అనకొండలు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను బలిపశువును చేశారని అన్నారు. అంటే హరీశ్‌రావు, సంతోష్ అవినీతిలో కేసీఆర్‌కు పాత్ర ఉందనే అర్థం. నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలి. అవినీతిపరులకు శిక్ష పడాలి. అవినీతిలో అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరున్నా వారిని శిక్షించాలని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
కాళేశ్వరం అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం !
September 02, 2025
0
Tags