ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో మొదటిసారిగా అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలూ మహిళలే !

Telugu Lo Computer
0


సీసీ మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ చరిత్రలోనే తొలిసారి పూర్తి స్థాయిలో మహిళలతో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత మహిళల టీ20 వరల్డ్‌ కప్‌, 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ ఇలా మహిళా అంపైర్లు, రిఫరీలను ఐసీసీ నియమించింది. అయితే వరల్డ్‌ కప్‌లో మాత్రం ఇదే మొదటిసారి. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్‌ 30 నుంచి భారత్‌, శ్రీలంక ఉమ్మడి ఆతిథ్యంలో జరగనుంది. ప్యానల్‌లో 14 మంది అంపైర్లు, నలుగురు మ్యాచ్ రెఫరీలు తమ సేవలందించనున్నారు. మహిళా అంపైర్లలో చాలామంది క్రికెట్‌ అభిమానులకు సుపరిచతమైన వారే ఉన్నారు. క్లైర్ పోలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్, స్యూ రెడ్‌ఫెర్న్‌కు ఇది మూడో మహిళల ప్రపంచ కప్‌. అలాగే.. లారెన్ అగెన్‌బాగ్, కిమ్ కాటన్‌కు ఇది రెండో టోర్నీ. మ్యాచ్‌ రెఫరీ ప్యానల్‌.. అనుభవజ్ఞులు, కొత్తవారితో సమతూకంగా ఉంది. ట్రూడీ ఆండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరా ఈ ప్యానల్‌లో సభ్యులుగా ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)