హంతకుడే సంతాపసభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్‌ తీరు !

Telugu Lo Computer
0


హంతకుడే సంతాపసభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్‌ తీరు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్‌రెడ్డిది ఒక మాట.. మంత్రి ఉత్తమ్‌ది మరో మాట అని ఎద్దేవా చేశారు. ''అవగాహన లేని సీఎం, నీళ్ల మంత్రి ఉండటం మన దౌర్భాగ్యం. సమ్మక్క సాగర్‌ పూర్తి చేసింది భారత రాష్ట్ర సమితి.. ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్‌. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు భయపడి బనకచర్లపై మౌనం వహించారు. కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఆల్మట్టి ఎత్తు పెంపుపైనా మౌనం వహిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రయోజనాల కంటే, పొరుగు రాష్ట్ర ప్రయోజనాలే ఎక్కువా?'' అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)