అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్ లైన్ సైట్స్ లో మొబైల్స్, యాక్ససరీస్, ట్యాబ్స్ కొనుగోలు చేసే వారికి శామ్‌సంగ్ పలు సూచనలు చేసింది. ఆన్‌లైన్‌లో రీఫర్ బిష్డ్, ఫేక్ వస్తువులు కొనకుండా యూజర్లను అలర్ట్ చేసింది. ఏ సెల్లర్ పడితే ఆ సెల్లర్ నుంచి తమ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని శాంసంగ్ కోరింది. తాము సూచించిన సెల్లర్ల నుంచి ప్రొడక్ట్స్ కొనాలని స్పష్టం చేసింది. అమెజాన్‌లో ఏ సెల్లర్ పడితే ఆ సెల్లర్ నుంచి కాకుండా Clicktech Retail, STPL Exclusive, Darshital Etel సెల్లర్స్ నుంచి మాత్రమే కొనాలంది. ఫ్లిప్‌కార్ట్ లో TrueCom Retail, Mythanglory Retail, BTPLD, Flashstar Commerceలో మాత్రమే తీసుకోవాలంది. గేర్స్ అండ్ యాక్ససరీస్ – Buzz India, SV PeriPherals, Unique Click. ట్యాబ్స్ అండ్ నోట్ పీసీ – India Flash Mart, Retailnet. తాము తెలిపిన సెల్లర్స్ నుంచి కాకుండా అన్ ఆథరైజ్డ్ సెల్లర్ల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తలు రీఫర్ బిష్డ్, ప్రీ యూజ్డ్, యాక్టివేటెడ్, కౌంటర్ ఫిట్ కావొచ్చని శాంసంగ్ కంపెనీ హెచ్చరించింది. ఫేక్, ఇది వరకే వాడిన ఉత్పత్తులను కొత్తవిగా చెప్పి అమ్మే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి ప్రొడక్ట్స్ కు సర్వీస్ లిమిటెడ్ గా ఉంటుందని శాంసంగ్ కంపెనీ తెలిపింది.
ఆన్ లైన్ సైట్స్ లో కొనే కస్టమర్లకు ముఖ్యమైన సూచనలు జారీ చేసిన శాంసంగ్ !
September 08, 2025
0
Tags