కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలోని వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులను ముఖ్యమంత్రి గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో పర్యటించారు. లింగంపల్లి ఖుర్ద్ వంతెన (కేకే వై హైవే)ను సందర్శించి, అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. అనంతరం బుర్గిద్ద వద్ద రైతుల పొలాలను పరిశీలించిన తర్వాత మహిళా రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతుల సమస్యలు విని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల ప్యాకేజీ మంజూరు చేసి దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు పునరుద్ధరించాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు. 'వరద నష్టం ఎక్కువగా జరగకుండా అప్రమత్తమై సరైన సమయంలో స్పందించి చర్యలు చేపట్టిన అధికారుల కృషిని అభినందిస్తున్నా. పరిపాలన సౌలభ్యం కోసం వివిధ శాఖలను ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 15 రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తా. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇంచార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సమీక్షలో మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లండి. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిధిని రాబట్టుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించాలి' అని సీఎం తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
September 04, 2025
0
Tags