ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ విజయం

Telugu Lo Computer
0


ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డికు 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు లెక్కలోకి రాలేదు. కాగా పార్లమెంట్‌లో మొత్తం ఓటర్లు 781 మంది ఎంపీలు ఉండగా767 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు దూరంగా ఉన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)