బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో నిన్న అమెరికా నుంచి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కవిత షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావులపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడా కేటీఆర్, హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు.
పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత బహిష్కరించిన బీఆర్ఎస్
September 02, 2025
0
Tags