వికసిత్‌ భారత్ లక్ష్య సాధనకు స్వయం సమృద్ధి బాటలో నడవడం తప్పనిసరి : దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా 'జీఎస్టీ పొదుపు ఉత్సవం' మొదలైందని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ విడుదల చేశారు. ''తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రజల్లో పొదుపును పెంచుతాయి. రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈ తదితర అన్ని వర్గాలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వృద్ధితోపాటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. ప్రతి రాష్ట్రం పురోగతిని వేగవంతం చేస్తాయి. శ్లాబుల తగ్గింపు వంటి సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ సరళీకృతం, వ్యాపార నిర్వహణ సులభతరం కానున్నాయి'' అని ప్రధాని మోడీ లేఖలో పేర్కొన్నారు. కొన్నేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఆదాయపు పన్నును రూ.12 లక్షల వరకు మినహాయించడం, జీఎస్టీ సంస్కరణలతో ఈ ఒక్క ఏడాదే ప్రజలకు రూ.2.50 లక్షల కోట్ల డబ్బు ఆదా కానుంది. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనకు స్వయం సమృద్ధి బాటలో నడవడం తప్పనిసరి. జీఎస్టీ సంస్కరణలు స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయి. స్వదేశీ తయారీ ఉత్పత్తులే విక్రయించాలని దుకాణదారులకు నా విజ్ఞప్తి. స్వదేశీ ఉత్పత్తులే కొనాలి, విక్రయించాలి. పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలి అని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)