రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో నిర్మించే సినిమా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి హాలీవుడ్ కు చెందిన వార్నర్ బ్రదర్స్ సంస్థతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశం మినహా మిగిలిన దేశాల్లో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఈ సంస్థకు అప్పగించారు. ఒప్పందం కూడా కుదిరింది. బాహుబలి సినిమా తీసే సమయంలోనే ప్రపంచ మార్కెట్ కు సంబంధించి ఆ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అంచనా వేశారు. దాని ప్రకారమే బాహుబలి2 విడుదల చేసి రూ.1800 కోట్లకు పైగా రాబట్టారు. అందుకే ఈ చిత్రానికి కూడా వారిద్దరూ గ్లోబల్ మార్కెట్ కు సంబంధించిన పనులు చూస్తున్నారు. వారి ఆలోచనల ప్రకారమే వార్నర్ బ్రదర్స్ తో ఒప్పందం కుదిరింది. హాలీవుడ్ లోని సూపర్ హిట్ చిత్రాలను కూడా ఇది బీట్ చేయడం ఖాయమంటున్నారు. ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఆధ్యాత్మిక టచ్ కూడా రాజమౌళి కలిపారు. హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ లో అక్టోబరు 10వ తేదీ వరకు షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది చివరలో లేదా 2027లో విడుదల చేసే అవకాశం ఉంది.
వార్నర్ బ్రదర్స్‌తో రాజమౌళి ఒప్పందం
September 23, 2025
0
Tags