నెల్లూరులో బి-ఫార్మసీ విద్యార్థిని దారుణం హత్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద ప్రేమోన్మాది ఘాతుకానికి బి-ఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ బలైంది. నిందితుడు నిఖిల్ మైధిలిని తన రూమ్‌కి పిలిచాడు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలపై వాగ్వాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆ క్రమంలో నిఖిల్ ఆగ్రహానికి లోనై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మైధిలి ప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన అనంతరం నిఖిల్ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మైధిలి ప్రేమను తిరస్కరించడంతో కోపం చెంది నిఖిల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిఖిల్‌ను కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు నిఖిల్‌కు కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని మృతురాలి బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)