లడఖ్ లో రాష్ట్ర హోదా కోరుతూ బుధవారం చేపట్టిన నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్విడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో పోలీసు వాహనానికి నిరసనకారులు నిప్పంటించారు. వందలాదిగా లేహ్ సిటీ వీధుల్లోకి వచ్చిన ప్రజలు రాష్ట్రహోదా, రాజ్యాంగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బుధవారం పూర్తిస్థాయి బంద్ కు పిలుపునిచ్చిన లడఖ్ వాసులు గతకొంతకాలంగా నిరాహార దీక్షలు చేపట్టారు. అంతేకాక బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వి, వారి వాహనాన్ని తగులబెట్టారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. గతమూడేళ్ల నుంచి కేంద్ర పాలనకు వ్యతిరేకంగా లడఖ్ ప్రజలు రోడ్లపైకి వచ్చి రాష్ట్రహోదా కల్పించాలని కోరుతున్నారు. తమ భూభాగం, సంస్కృతి, వనరులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లడఖ్ ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 6న సమావేశానికి ఆహ్వానించింది. ఆ రాష్ట్రం ఏర్పాటుకు ప్రజల డిమాండ్ పై చర్చలను పునఃప్రారంభనుంది.
లడఖ్ లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు : పోలీసు వాహనానికి నిప్పు !
September 24, 2025
0
Tags