అగ్నిప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం

Telugu Lo Computer
0


డిశాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజర్‌లో అగ్నిఫ్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించారు. ఈ పరీక్ష పూర్తిగా విజయవంతమైంది. ఈ క్షిపణి 2వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధిస్తుంది. దీంతో భారత సైన్యం విస్తారమైన రైలు నెట్‌వర్క్‌ను ఉపయోగించి దేశంలోని ఏ మూల నుంచి అయినా ఈ క్షిపణిని రవాణా చేయడంతోపాటు.. ప్రయోగించొచ్చు. ఇది క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తన 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేశారు. అణుసామర్థ్యం ఉన్న అగ్నిఫ్రైమ్ క్షిపణిని తొలిసారి రైలు పైనుంచి ప్రయోగించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థను ఆయన అభినందించారు. అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంఛింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. రైలు నెట్‌వర్క్ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి.. తక్కువ రియాక్షన్ టైమ్‌లో శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చునని తెలిపారు. ఈ కొత్త తరం క్షిపణి దాదాపు 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనుసైతం చేధించగలదని చెప్పారు.


Post a Comment

0Comments

Post a Comment (0)