ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఆషియానా ప్రాంతంలోని రుచి, రజనీ ఖండ్ కాలనీల్లో రాత్రి వేళ చిరుత పులి సంచరిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి, ఆ చిరుత కోసం ఆ ప్రాంతంలో వెతికారు. అక్కడి ప్రజలను ఆరా తీశారు. అయితే చిరుత సంచారం లేదని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వైరల్ అయిన ఫొటోలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఏఐ ద్వారా నకిలీ ఫొటోలు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుసుకున్నారు. మరోవైపు బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (బీజేఎంసీ) చదువుతున్న 22 ఏళ్ల విద్యార్థి ఈ నకిలీ ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ యువకుడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చిరుత నకిలీ ఫొటోలను షేర్ చేసిన అతడి ఫ్రెండ్‌ను కూడా విచారిస్తామని పోలీసు అధికారి తెలిపారు.
చిరుత సంచరిస్తున్నట్లు నకిలీ ఫొటోలు వైరల్ : విద్యార్థిని అరెస్ట్ చేసిన పోలీసులు
September 27, 2025
0
Tags