6 ఏళ్లు OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ గెలాక్సీ F17 5G విడుదల

Telugu Lo Computer
0


శాంసంగ్‌ సంస్థ 'ఎఫ్‌' సిరీస్‌లో ఆరేళ్లపాటు ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ అప్‌డేట్స్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్17 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. దీనిలో ప్రాసెసర్‌ ఎక్సీనోస్ 1330ను అమర్చారు. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 90Hz రిఫ్రెష్‌రేటు, 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇది కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఈ ఫోన్‌ 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్‌ వెనకభాగంలో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్‌, 2 ఎంపీ మాక్రో కెమెరా ఇచ్చారు. 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత వన్‌ యూఐ7తో పనిచేస్తుంది. వైలెట్‌ పోప్‌, నియో బ్లాక్‌ కలర్లలో లభిస్తుంది. ఈ  రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఫోన్‌ను 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.14,499గా శాంసంగ్‌ నిర్ణయించింది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.15,999గా పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్‌తో కొనుగోలుపై కస్టమర్లు రూ.500 వరకు క్యాషబ్యాక్‌ పొందొచ్చని కంపెనీ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)