దేశంలో 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

Telugu Lo Computer
0


ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లలో భారీ పెంపుకు ఇవాళ కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి, ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడ్ కోసం సీఎస్ఎస్ విస్తరణకు ఆమోదం తెలిపింది. ఫలితంగా దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు వీలవుతుంది. తాజా మార్పులతో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు 1,18,190కి, పీజీ సీట్లు 74,306కి చేరుకుంటాయి. మొత్తం రూ.15,034.50 కోట్ల బడ్జెట్ (2025 26 నుంచి 2028 29 వరకు)తో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఇందులో కేంద్ర వాటా రూ.10,303.20 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ.4,731.30 కోట్లు. ఈ విస్తరణ వైద్యులు, స్పెషలిస్టుల సంఖ్యను పెంచి, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తుంది. ఇది విద్యార్థులకు మరిన్ని వైద్య వృత్తి అవకాశాలు, ఉద్యోగాలు (వైద్యులు, ఫ్యాకల్టీ, పారామెడికల్ సిబ్బంది) సృష్టించడంతో పాటు, భారతదేశాన్ని సరసమైన ఆరోగ్య సేవల గ్లోబల్ హబ్‌గా మార్చుతుంది. ఇప్పటికే దేశంలో 808 మెడికల్ కళాశాలలో 1,23,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నప్పటికీ, డిమాండ్‌కు తగ్గట్టు సామర్థ్యం పెంచడం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మార్పుల అమలుకు మార్గదర్శకాలు వెంటనే జారీ చేస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)