సింగరేణి కార్మికులకు 34 శాతం బోనస్‌

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు 34 శాతం వాటాను బోనస్‌గా పంచాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 33 శాతం వాటాను కార్మికులకు పంచిన విషయం తెలిసిందే. మొత్తం రూ.819 కోట్లను సింగరేణి కార్మికులకు పంపిణీ చేస్తామని భట్టి తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ “సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మవంటిది. ఈ సంస్థ బొగ్గు గని మాత్రమే కాదు, అది ఒక ఉద్యోగ గని. సింగరేణి సంస్థను జాగ్రత్తగా నడుపుతున్న యాజమాన్యానికి అభినందనలు. సింగరేణి సంస్థలో అన్ని రకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారు. కోల్‌ఇండియాలో ఇవ్వని అలవెన్సులు కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం” అని ఆయన తెలిపారు. సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్‌ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. సంస్థ మొత్తం రూ.6,394 కోట్ల లాభాలను అర్జించిందని అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)