దేశీయ మార్కెట్లో విడుదలైన స్కోడా కంపెనీ కైలాక్ కారు ఎనిమిది నెలల్లో 30000 యూనిట్ల కంటే ఎక్కువ సేల్స్ సాధించింది. 2025 జనవరిలో 1242 యూనిట్ల అమ్మకాలను సాధించిన స్కోడా కైలాక్, ఆగస్టులో 3099 యూనిట్ల సేల్స్ పొందగలిగింది. ఇలా మొత్తం మీద ఈ కారు జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో 30190 అమ్మకాలు పొందింది. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్కోడా కైలాక్ 1.10 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 115 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ మరియు ప్రెస్టీజ్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో ఏడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది.
ఎనిమిది నెలలు 30000 కైలాక్ కార్లను అమ్మిన స్కోడా !
September 30, 2025
0
Tags