అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా 5G ను భారీ తగ్గింపుతో అందుబాటులోకి తెసుకొస్తోంది. సాధారణంగా రూ. 1,29,999 ధర కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 24,001 తగ్గింపుతో రూ. 1,05,998కి లభిస్తోంది. అదనంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 1,500 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 1,04,500కే పొందవచ్చు. EMI ఆప్షన్ కింద నెలకు రూ. 5,114 నుంచి చెల్లింపులు ప్రారంభించవచ్చు. అంతేకాకుండా, పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌లో ఇస్తే గరిష్టంగా రూ. 43,300 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఇది టైటానియం ఫ్రేమ్ తో తయారు చేయబడింది. ఫోన్ ముందు, వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 గ్లాస్ రక్షణ కల్పించారు. IP68 రేటింగ్ ఉన్నందున ఇది నీరు, ధూళి నిరోధకత కలిగి ఉంటుంది. ఫోన్ ప్రీమియం ఫీల్‌తో పాటు కఠినమైన పరిస్థితుల్లోనూ బలంగా నిలబడేలా రూపొందించబడింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.9-అంగుళాల QHD+ డైనమిక్ LTPO AMOLED 2X డిస్‌ప్లే ఉంది. విజన్ బూస్టర్ టెక్నాలజీతో డిస్‌ప్లే కాంతివంతంగా, స్పష్టంగా కనిపిస్తుంది. 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉన్నందున గేమింగ్, వీడియోలు, స్క్రోలింగ్ అన్నీ సూపర్ స్మూత్‌గా ఉంటాయి. HDR10+ సపోర్ట్‌తో సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో వస్తోంది. ఇది 4.47GHz క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ CPU, Adreno 830 GPUతో కలిసి హై-పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. Android 15 ఆధారంగా రూపొందించిన One UI 7 సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్ మరింత సులభమైన, ఫ్రెండ్లీ అనుభూతిని ఇస్తుంది. కెమెరా సెటప్ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్ లెవల్‌గా నిలుస్తోంది. 200MP ప్రైమరీ కెమెరా OIS మద్దతుతో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు ఇస్తుంది. 8K వీడియో రికార్డింగ్, నైట్ మోడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ కోసం హై-రెజల్యూషన్ ఫ్రంట్ కెమెరా కూడా కల్పించారు. 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతును కలిగి ఉంది. రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా ఇతర పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా 5G పై డిస్కౌంట్ ఆఫర్
September 12, 2025
0
Tags