శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన పిటీషన్ లో న్యాయ నిపుణులతో చర్చించిన తరువాత కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ నెల 20న పంబా నది ఒడ్డున గ్లోబల్ అయ్యప్ప సమావేశం భారీ స్థాయిలో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం పిటీషన్ లో నిపుణులతో సంప్రదింపులు చేసిన తరువాత కొత్త పిటీషన్ సమర్పించాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ముందు ఉంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆచారాల వివరాలను ధర్మాసనం ముందు సమర్పిస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ వెల్లడించారు. కాగా, మరో వైపు అయ్యప్ప ఆచారాలను పరిరక్షిస్తామని దేవస్థానం హామీ ఇస్తే, దానికి సహకరిస్తామని ప్రముఖ సమాజ సంస్థలు ఎన్ఎస్ఎస్, ఎస్ఎన్డీపీలు ప్రకటించాయి. కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ పైనా ప్రశాంత్ సీరియస్ గా స్పందించారు. కేంద్రంలో రెండోసారి మోడీ ప్రభుత్వం అధికారం వస్తే శబరిమల ఆచారాలను పరిరక్షించడానికి పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ప్రకటించారని, ఆ విషయంలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, సెప్టెంబరు 20న పంబా నది ఒడ్డున 'గ్లోబల్ అయ్యప్ప సమావేశం' భారీఎత్తున నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వాసవన్ ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుందని వెల్లడించారు. కేరళ నుంచి 800 మంది, తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆలోచనలను స్వీకరించడం, ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను వారికి అందించడం, వారి సూచనలు స్వీకరించడం ఈ సమావేశ ప్రాథమిక లక్ష్యాలుగా వివరించారు.
20న పంబా నది ఒడ్డున గ్లోబల్ అయ్యప్ప సమావేశం
September 02, 2025
0
Tags