సెప్టెంబర్ 10న అనంతపురంలో సూపర్ సిక్స్- సూపర్ హిట్ భారీ బహిరంగ సభ

Telugu Lo Computer
0


నంతపురంలో సెప్టెంబర్ 10న నిర్వహించే సూపర్ సిక్స్- సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నారాయణ, సవిత, పయ్యావుల కేశవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమీక్షించారు. సభా వేదిక, హెలిపాడ్ ఏర్పాటు చేసే స్థలాలను మంత్రుల బృందం పరిశీలించింది. సూపర్ సిక్స్- సూపర్ హిట్ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు వాహనాల పార్కింగ్, మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర అవసరాలపై మంత్రుల బృందం చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు అనతికాలంలోనే అమలు చేశాం.. భవిష్యత్తులో ఏం చేయాలని యోచిస్తున్నాం.. అనంతపురాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం.. సభకు 3.5 లక్షల మంది హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాం.. సభకు వచ్చే వారికి ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తాం.. ఇక, ప్రతిపక్ష హోదా లేని నాయకుడు అనవసర ఆరోపణలు చేస్తున్నారు.. అందరికీ యూనివర్షల్ బీమా పాలసీ తీసుకొస్తే విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. 6 గంటల్లో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.. మెడికల్ కళాశాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. విశాఖలో ప్యాలెస్ కట్టే బదులు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా అన్నారు. మా నాయకులపై కేసులు ప్రజా హితం కోసం పెట్టినవి, వాళ్ళ మాదిరి దోచుకొని దాచుకోలేదని మంత్రి అనగాని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)