ఉపరాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థిగా అమిత్ షా?

Telugu Lo Computer
0


పరాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెల 9న పోలింగ్ జరగనుండగా పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశముంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే, ఈసారి పోటీ తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండీ కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టే యత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కూటమి తరపున ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే పేరే బలంగా వినిపిస్తోంది. అధికార ఎన్డీయే కూటమి కూడా అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అందరి దృష్టి ఇప్పుడు అమిత్ షాపైనే ఉంది. కేంద్ర హోంమంత్రిగా సేవలందిస్తున్న అమిత్ షా,  ప్రస్తుతం అద్వానీ తర్వాత అత్యధికకాలం హోంమంత్రి గా కొనసాగుతున్న నేతగా రికార్డు నెలకొల్పారు. వ్యూహపూరితంగా వ్యవహరించే నేతగా, మోడీకి అత్యంత విశ్వసనీయుడిగా పేరు తెచ్చుకున్న అమిత్ షా ఉపరాష్ట్రపతి పదవికి బెస్ట్ ఎంపిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక  ఉత్కంఠభరితంగా, భారీ మలుపులతో రాజకీయంగా రసవత్తరంగా మారనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)