అలహాబాద్‌ హైకోర్టుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

Telugu Lo Computer
0


సివిల్‌ వివాదాన్ని క్రిమినల్‌ కేసుగా మారుస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పులతడకగా పేర్కొంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసు పరిష్కారానికి సమయం పడుతుందనే కారణంతో సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలను హైకోర్టు సమర్థించడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యలు న్యాయస్థానం తనకున్న హక్కులను దుర్వినియోగం చేయడమే అని అభిప్రాయ పడింది. సివిల్‌ సమస్యలను పరిష్కరించడానికి క్రిమినల్‌ చట్టాలను ఉపయోగించలేమనే చట్టపరమైన నిబంధనలను.. ఇరు కేసుల మధ్య ఉన్న వ్యత్యాసాలను హైకోర్టు అర్థం చేసుకుంటుందని తాము ఆశించినట్లు ధర్మాసనం పేర్కొంది. ఇకపై న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చే సమయంలో ఇలాంటి అతిక్రమణలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అలహాబాద్‌ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సంబంధిత న్యాయమూర్తి ఆ తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించింది. అంతే కాకుండా ఆ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి పదవీ విరమణ చేసే వరకు ఆయనకు ఎటువంటి క్రిమినల్‌ కేసులూ కేటాయించకుండా చూసుకోవాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. కాగా, ఇప్పటికే పలు కోర్టులు, పోలీసులు ఆస్తి వివాదాలకు సంబంధించిన సివిల్‌ కేసులను క్రిమినల్‌ కేసులుగా మార్చడాన్ని సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు తప్పుబట్టిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)