ఏఐ దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న ఉద్యోగులు సైతం ఆఫీసులకు పరుగులు !

Telugu Lo Computer
0


బెంగళూరులోని సిలికాన్ వ్యాలీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఐటీ సంస్థలు ఏఐని తీసుకొచ్చి ఉద్యోగుల్ని ఎలా తొలగించాలా అని ఎదురుచూస్తున్నాయి. దీంతో ఇప్పటివరకూ వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న ఉద్యోగులు సైతం ఆఫీసులకు పరుగులు తీస్తున్నారట!. ఇలా కరోనా తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లను వదిలి ఆఫీసులకు తరలివస్తుండటంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ జామ్ లు పెరిగిపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ లతో గడిపేస్తున్న బెంగళూరు టెకీలు ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయన్న భయంతో ఆఫీసులకు వచ్చేందుకే మొగ్గు చూపుతున్నారు. సంస్థలకు రిక్వెస్టులు పెట్టుకుని మరీ ఆఫీసులకు వచ్చేస్తున్నారట!. దీంతో ముఖ్యంగా వారం మధ్యలో, బుధవారం ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ తో నిండిపోతోందట. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల తాజా డేటా ప్రకారం ఔటర్ వెంబడి ఉన్న 26 ప్రధాన టెక్ పార్కుల్లోకి గత సంవత్సరంతో పోలిస్తే ఈ జూన్‌లో ఎంట్రీలు 45 శాతం పెరిగాయట. గత జూన్ లో 82 వేలుగా ఉన్న ఈ ఎంట్రీలు ఈ ఏడాది లక్షా 20 వేలు దాటిపోయాయట. ఏఐ కారణంగా ఉద్యోగాలు కాపాడుకునేందుకు వారంలో కనీసం నాలుగు రోజులు ఆఫీసులకు వెళ్తున్నట్లు బెంగళూరు టెకీలు చెప్తున్నారు. ఇంట్లో నుంచి పనిచేసే వారితో పోలిస్తే వ్యక్తిగతంగా ఆఫీసుల్లో కనిపిస్తే కఠిన సమయాల్లో ఉద్యోగాలను నిలబెట్టుకోవచ్చన్న భావన అక్కడి టెకీల్లో పెరుగుతుందట. వీరి కారణంగా ఎలక్ట్రానిక్స్ సిటీకి వెళ్లే దారుల్లో ట్రాఫిక్ జామ్ లు పెరుగుతున్నట్లు బెంగళూరు పోలీసులు చెప్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)