హుస్సేన్ సాగర్ తీరం తరహాలా కుకట్ పల్లి నల్ల చెరువు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరం పైన స్పెషల్ ఫోకస్ చేసిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.  నగరంలో ట్యాంక్ బండ్ తరహాలో పలు ప్రాంతాల్లో మినీ ట్యాంక్ బండ్ లు ఉన్నాయి. కాగా హుస్సేన్ సాగర్ తీరం తరహాలా మరో నిర్మాణం దిశగా ప్రణాళికలు సిద్దం అయ్యాయి. ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దటంతో పాటుగా బోటు షికారు ఏర్పాటు చేసేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. నగరంలోని కుకట్ పల్లిలో ఉన్న నల్లచెరువు లో కొత్తగా ట్యాంక్ బండ్ నిర్మాణం దిశగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. రెవిన్యూ రికార్డుల మేరకు ఈ చెరువు విస్తీర్ణం 28 ఎకరాలు. కానీ మొత్తం ఆక్రమణదారుల కబ్జాలకు గురైంది. దాదాపు 12 ఎకరాలు ఆక్రమించి షెడ్లు, ఇతర నిర్మాణాలు చెరువులోనే చేశారు. మిగిలిన ప్రాంతంలో చెత్త, నిర్మాణ వ్యర్థాలను వేసి మొత్తం అస్తవ్యస్థంగా మార్చేశారు. కాగా, ప్రస్తుతం ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. చెరువు విస్తీర్ణాన్ని సుమారు 28 ఎకరాలకు తీసుకువచ్చారు. చెరువులో వేసిన నిర్మాణ వ్యర్థాలను తొలగించడంతో పాటు అదనంగా 4 మీటర్ల లోతులో పూడికతీత పనులను చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో జలకళ సంతరించుకుంది. బోటు షికారు ఏర్పాట్ల కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మరో ట్యాంక్ బండ్ తరహాలో కుకట్ పల్లి నల్లచెరువును తీర్చి దిద్దుతున్నారు. ఈ ప్రాంతంలో ఈ తరహాలో డెవలప్ చేయటం ద్వారా పూర్తిగా కొత్త రూపు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైడ్రా ఏర్పాటు తరువాత బతుకమ్మకుంటను పునరుద్దరించారు. తరువాత కూకట్‌పల్లిలోని నల్లచెరువును అద్భుతంగా, అందంగా ఆధునికీకరించారు. త్వరలోనే ఇది పర్యాటక ప్రాంతంగా మారనుంది. నగరంలో మొత్తం 13 చెరువుల అభివృద్ధి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతోంది. హైడ్రా మొదటిద శలో 6 చెరువుల పనులను చేపట్టింది. ఈ క్రమంలో ఎన్నో రాజకీయ, అధికార ఒత్తిడులను హైడ్రా సంస్థ ఎదుర్కొంది. ఐల్యాండ్, జీవ వైవిధ్యం ఉండేలా తగిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. కమ్యూనిటీ హాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)