చెన్నైలోని ప్రభుత్వ ఓమందూరు ఆస్పత్రిలో హాస్టల్‌లో ఉంటూ ఎంఎస్సీ చేసే ఓ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను ఏం చేయాలో తోచక ఆమె ప్రియుడు ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ యువకుడుని అదుపులోకి తీసుకున్నాడు. చెన్నై ట్రిప్లికేన్‌లోని ఓమందూరార్ ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు పుట్టి ఒక్కరోజే అయిన శిశువును సంచిలో తీసుకొచ్చాడు. తనకు ఆ శిశువు రోడ్డుపై దొరికిందని ఆసుపత్రి సిబ్బందితో చెప్పాడు. అయితే వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఆ యువకుడిని విచారించారు. ఆ సమయంలో అతడు పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా తాను ఊటీ నుంచి వచ్చానని, తన పేరు ప్రదీప్ అని చెప్పాడు. గ్రూప్-1 ఎగ్జామ్ కోసం చెన్నైలోని హాస్టల్లో ఉంటూ చదువుతున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో గిండి వర్సిటీ హాస్టల్‌లో ఉంటూ ఎంఎస్సీ చదువుతున్న ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, తాము శారీరకంగా ఒక్కటైనట్లు తెలిపాడు. దాంతో ఆ యువతి గర్భం దాల్చిందని చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం సదరు యువతి హాస్టల్‌లో బిడ్డను ప్రసవించిందని, ఏం చేయాలో తోచక తాను బిడ్డను ఆసుపత్రిలో ఇచ్చేందుకు వచ్చానని పోలీసులతో అసలు నిజం చెప్పాడు. ప్రదీప్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హాస్టల్లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని : బిడ్డను ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు !
August 11, 2025
0
Tags