బస్సు ఎందుకు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టిన ప్రయాణికురాలు : సోషల్ మీడియాలో వీడియో వైరల్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా సర్పాల మండలం నడిమివంక గ్రామం వద్ద ఒక మహిళ బస్సు కోసం వేచి చూస్తుంది. ఇంతలో అనంతపురం నుండి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సు వచ్చింది. కానీ మహిళ ఉన్న చోట మాత్రం ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో మహిళ ఆగ్రహాంతో, బైకుపై ఓవర్ టేక్ చేసి బస్సు ఆపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. డ్రైవర్ ను కాలర్ పట్టుకుని బస్సు ఎందుకు ఆపలేదని అడిగి చెంపపై కొట్టింది. దీంతో అతను ఎంతగా చెప్పాలని చూసిన ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో డ్రైవర్ స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటననుబస్సులో ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)